సిరాన్యూస్, కుందుర్పి
ఎస్సై జీవి నగేష్ బాబును సన్మానించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ
నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జీవి నగేష్ బాబును గురువారం మండల బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎస్సైను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ మాట్లాడారు. మండలంలో నెలకొన్న సమస్యలను వివరించారు. పక్షపాతం లేకుండా పార్టీలకు అతీతంగా సేవలు అందిచాలని ఎస్సైను కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కో కన్వీనర్ కె గంగాధర, మండల అధ్యక్షులు సజ్జల వెంకటేష్,ఉపాధ్యక్షులు శివ కుమార్ కిష్టప్ప కిసాన్ మోర్చా భాస్కర్, వన్నూరుస్వామి పాల్గొన్నారు