సిరాన్యూస్,సామర్లకోట
పండిత్ దీన్ దయాళ్ సేవలు మరువలేనివి: బీజేపీ పట్టణ అధ్యక్షులు అల్లు ప్రసాద్
పండిత్ దీన్ దయాళ్ సేవలు మరువలేనివని బీజేపీ పట్టణ అధ్యక్షులు అల్లు ప్రసాద్ అన్నారు. బుధవారం పెద్దాపురం బీజేపీ పట్టణ కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యయ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు అల్లు ప్రసాద్ మాట్లాడారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయ సాధన దిశగా ప్రతి బీజేపీ కార్యకర్త పని చేయాలన్నారు.కార్యక్రమంలో నియోజక వర్గ కో కన్వీనర్ చెరుకూరి రవికృష్ణ, సీనియర్ నాయకులు తాటికొండ సుబ్బారావు,పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి యాళ్ల నాని,సర్వసిద్ది సతీష్, కేదరిశెట్టి శివ,పొన్నూరు మణికంఠ,దాసరి రమేష్,నెక్కల ప్రకాష్, జి శివప్రసాద్,యానాల రాంబాబు పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.