సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
ప్రతి పోలింగ్ బూత్ లో 100 సభ్యత్వాలు చేయాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్
ప్రతి పోలింగ్ బూత్ లో 100 సభ్యత్వాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో బీజేపీ క్రియాశీల సభ్యత్వాలపై పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి పోలింగ్ బూత్ లో 100 సభ్యత్వాలు చేయాలని సూచించామన్నారు. పోలింగ్ బూతుల వారీగా వివరాలు అడిగి తెలుసుకుని 100 సభ్యత్వాలు పూర్తి చేసిన వారు క్రియాశీల సభ్యులుగా సభ్యత్వం తీసుకోవాలని వివరించారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు క్రియాశీల సభ్యత్వం ఉన్న వారికే పార్టీ పదవులు ఇస్తుందని తెలిపారు. సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్, పెద్దపల్లి ప్రబారి ఆరుముల పోశం, పెద్దపల్లి ఇంచార్జ్ పోలసాని సంపత్ రావు, బీజేపీ నాయకులు గరిడే కిషన్, కారుపాకల శంకర్, శివరామకృష్ణ. మూస్కె సంపత్, పోగులశీను, కొత్తగట్టునాగరాజు, చిత్రాలరవి , తదితరులు పాల్గొన్నారు.