ఒక్క మిస్డ్ కాల్ తో బీజేపీ సభ్యత్వం

సిరా న్యూస్,హైదరాబాద్;
ఒక్క మిస్డ్ కాల్ తో భారతీయ జనతాపార్టీ, అనుబంధ సంస్థలలో సభ్యత్వం పొందవచ్చునని పార్టీ రాష్ట్ర కార్యనిర్యాహక కార్యదర్శి చంద్రశేఖర్ జీ తెలిపారు. మలక్ పేట నియోజకవర్గం శాలివాహన నగర్ ఎస్ బీఐ కాలనీ కమ్యూనిటీ హాలులో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కోసం టోల్ ఫ్రీ నంబర్ 18002662020 కు మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే సభ్యత్వ నమోదు జరిగిపోతుందన్నారు. “ఘరఘర్, గావ్ గావ్” నినాదంతో కార్యకర్తలు ముందుకు సాగి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపు నిచ్చారు.తెలంగాణలోరామరాజ్యం స్థాపన కోసం నడుం బిగించి పోరాడాలన్నారు.ఏ స్వార్ధ్యం లేకుండా పోరాడిన వాళ్లే నిజమైన బీజేపీ కార్యకర్తలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్ రెడ్డి.నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ. కార్పొరేటర్లు కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి,.భాగ్యలక్ష్మి, గజాఆనంద్ గౌడ్,కొత్త కాపు రవీందర్ రెడ్డి, వీరేందే బాబు,సహదేవ్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి,నరసింహ,గోపి,హరి గౌడ్,మంజుల రెడ్డి,రమణ సింగ్,భారత్,దీనిష్ గౌలికర్, ఆశిష్ బిజెపి నాయకులు కార్యకర్తలు, మహిళా మోచ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *