సిరాన్యూస్, ఖానాపూర్
అరిపెల్లి నాగన్నను పరామర్శించిన బీజేపీ నాయకులు పొద్దుటూరి గోపాల్ రెడ్డి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లోనీ రంగాపేట్ గ్రామానికి చెందిన అరిపెల్లి నాగన్నకు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. అరిపెల్లి నాగన్న ఆస్పత్రి చికిత్స పొంది ఇంటికి వచ్చారు. ఈవిషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు పొద్దుటూరి గోపాల్ రెడ్డి అరిపెల్లి నాగన్నను పరామర్శించారు.ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట శంకర్, కట్ట రమణయ్య, పెట్టెం రాజలింగు ,జంగం మల్లయ్య, బీజేపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.