సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వర్గపోరు బట్టబయలైంది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో త్రోపులాట జరగ్గా అడ్డుకున్న పోలీసులు ఆందోళన చేసేవారిని సమావేశం నుండి బయటకి తరలించారు.ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని ఉంటే ఎన్నికల సమయంలో పార్టీ లోకి కొత్తగా వలస వచ్చిన వారు ఇప్పుడు పెత్తనం చేలాయిస్తూ తమను అవమానాలు పాలు చేస్తున్నారని కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే వద్ద వాపోయారు.సీనియర్ కాంగ్రెస్ లీడర్ ని అంటూ మరి కొందరు అక్రమాలు చేస్తున్నారని కార్యకర్తలు ఎమ్మెల్యే దృషికి తీసుకువచ్చారు. సమావేశంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. వర్గాలుగా ఉన్న కార్యకర్తలు జై పొంగులేటి,జై బట్టి, జై జూపల్లి అంటూ నినాదాలు చేయడంతో ఎమ్మెల్యే సైతం అసహనం వ్యక్తం చేశారు.