BMS president Boorla Lakshminarayana: ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను జర్నలిస్టులందరికి వర్తింప జేయాలి

సిరాన్యూస్,ఓదెల
ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌ను జర్నలిస్టులందరికి వర్తింప జేయాలి
* భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు బూర్ల లక్ష్మినారాయణ

ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అక్రిడెషన్ లేని వర్కింగ్ జర్నలిస్టులందరికి వర్తింప జేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు బూర్ల లక్ష్మినారాయణ అన్నారు. బుధ‌వారం ఓదెలలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలిచేది విలేకరులు మాత్రమేన‌ని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులందరికీ రెండు పడకల గదుల ఇండ్లను లేక ఇంటి స్థలాలను వెంటనే కేటాయించాల‌న్నారు. మ్యానిపేస్టోలో పొందు పరిచినట్టుగా అక్రిడెషన్ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ బీమా హెల్త్ కార్డులు, కార్పరెట్ విద్య సంస్థల్లో అర్హత కలిగిన జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల‌ని అన్నారు. ఇటీవల కాలంలో ఆయా ప్రసార మాధ్యమాలలో పనిచేస్తున్న జర్నలిస్టుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. గత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు అక్రిడేషన్ కార్డు అంటూ రకరకాల వదంతుల ద్వారా వారి మనోగతాన్ని దెబ్బతీస్తున్నాయ‌ని తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేకసార్లు అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టులందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాల నుండి పోరాడి గెలిచి సాధించుకున్న జవహర్ లాల్ నెహ్రు సొసైటీ ఇండ్ల పట్టాలను విలేకరులకు తానే ఇండ్ల పట్టాలు ఇచ్చినట్టు వ్యవహారించారని తెలిపారు. ఆకలితో అలమటించి బయటకు చెప్పుకుంటే గౌరవం దెబ్బతింటుందని అప్పుల పాలైన విలేకర్లు ఎంతో మంది ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి ప్రజలకు ప్రభుత్వానికి వెన్నెముకగా ఉండే విలేకరులను ఆదుకోవాలని అన్నారు. అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి చిన్న పెద్ద పత్రిక అనే తేడా లేకుండా మీడియా జర్నలిస్టుకు కుడా రెండు పడకల ఇల్లు లేదా స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స‌మావేశంలో రాష్ట్ర కార్యదర్శులు కంది శ్రీనివాస్ బిఎంఎస్ జిల్లా కమిటీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *