సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు అధికారులు, కార్మికులు శ్రమిస్తున్నారు. పది మందితో కూడిన డైవింగ్ టీమ్ నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేస్తున్నారు. బోట్లు దృఢంగా ఉండటంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. దీంతో ఈ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్య పడలేదు.