సిరా న్యూస్, బోథ్
వినాయకుడిని దర్శించుకున్న బోథ్ ఎస్సై ప్రవీణ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ (బి) గ్రామంలో కొలువైన అంబేద్కర్ గణేష్ మండలి వినాయకుడిని శనివారం బోథ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ దర్శించుకున్నారు. ఈసందర్బంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక గణేష్ మండలి వారు ఎస్ఐ ప్రవీణ్ ని శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం అంబేద్కర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.