సిరా న్యూస్,సికింద్రాబాద్;
బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోయిన్ పల్లి చెక్పోస్ట్ నుండి సుచిత్ర వరకు (నాగపూర్ హై వే) రహదారి ఇరువైపులా వెలసిన అక్రమ వ్యాపార సముదాయాలపై ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు కొరడా ఝులిపించారు. ఫుట్పాత్, రక్షణ శాఖ భూములలో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యాపారాలు సాగించడమే కాకుండా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్నారని వచ్చిన అనేక పిర్యాదులతో చర్యలకు పూనుకున్నట్లు సానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. తొలగించిన వాటిలో పండ్ల దుకాణాలు, నర్సరీలు, గృహోపకర వస్తువుల దుకాణాలు ఉన్నాయి. ఫుట్ పాత్ లను ఆక్రమించడమే కాకుండా రోడ్డు పైనే వాహనాలు నిలిపి రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమౌతున్నట్లు పేర్కొన్నారు. మళ్ళీ వ్యాపారాలు మొదలి పెడితే మరింతా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.