Bolero hal chal…traffic jam బోలెరో హల్ చల్…ట్రాఫిక్ జామ్

సిరా న్యూస్,మేడ్చల్ః
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఆర్ధరాత్రి ఓ బోలెరో హల్చల్ చేసింది. రోడ్డుపై ఆర్.టి.సి బస్సు సైడ్ ఇవ్వలేదని 3ఆర్.టి.సి బస్సులను బోలెరోతో యువకులు గుద్దారు. నడిరోడ్డుపై బొలెరో ను పార్క్ చేసి ఆర్.టి.సి బస్సులతో పాటు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ చేసి నానా హంగమా చేసారు. ఆ దారిలో వెళ్తున్న కూకట్ పల్లి ట్రాఫిక్ సిఐ రావడంతో బొలెరో వాహనదారులు పరారయ్యారు. బొలెరో తో పాటు హంగమా చేసిన ముగ్గురు యువకులపై దుండిగల్ పియస్ లో ఆర్.టి.సి డ్రైవర్ లు పిర్యాదు చేసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *