సిరా న్యూస్,రాజమండ్రి;
కడియం నర్సరీలో చిరుత తిరుగుతున్నట్లు స్థానిక రైతులు సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి ఇవి చిరుత పులి పాదముద్రలుగా గుర్తించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారిణి భరణి, కోనసీమ జిల్లా అటవీశాఖ అధికారి ప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే జాగ్రత్తలు తెలిపారు. చిరుత సంచారం కలకలం రేపిందన్న వార్తల నేపథ్యంలో జిల్లా అటవీ శాఖాధికారులను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అటవీశాఖ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసాఇచ్చారు. అలాగే చిరుత కదలికలు గుర్తించేందుకు నర్సరీలలో 20 ట్రాప్ కెమెరాలను అమర్చారు. అలాగే రెండు బోనులలో చిరుతకు ఎరగా మేక పిల్లను, పందిని అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమీపంలో చిరుత పులి కదలికను పాదముద్రల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చిరుత పులి బుర్రిలంకకు సమీపంలో ఓ నర్సరీలో గుబురుగా గల ఈత చెట్ల పొదలలో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.