సిరాన్యూస్,ఇచ్చోడ
బోరిగామలో సామూహిక కుంకుమార్చన
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బోరిగామ గ్రామంలో వెలసిన ఆయా గణేష్ మండపాల వద్ద నిత్యం భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. కాగా గ్రామంలోని పాత హనుమాన్ మందిర్ లో ప్రతిష్టించిన గణేష్ మండపం వద్ద శుక్రవారం గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే న్యూ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయకునికి 51 నైవేద్యాలను సమర్పించి విశేష పూజలతో పాటు మహిళలు ఆధ్వర్యంలో పెద్దఎత్తున కుంకుమార్చన మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహనికి కాలనీవాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు.