సిరాన్యూస్,చిగురుమామిడి
అనారోగ్యంతో రైతు చట్ల రాజయ్య పాడి ఆవు మృతి
అనారోగ్యంతో పాడి ఆవు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బొమ్మనపల్లి గ్రామానికి చెందిన చట్ల రాజయ్య అనే రైతు పాడి ఆవు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ.70,000 ఉంటుందని తెలిపారు. ఆవు మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు కన్నీరు మున్నిరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.