సిరా న్యూస్,తిరుపతి;
తిరుపతి నగరం, జీవకోనలోని సంతోషమ్మ నగర్ కు చెందిన ఆనంద్, చిట్టిల కుమారుడు పదేళ్ల నిఖిల్ 6వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం తన తాతతో కలిసి మంగళంలోని రిక్షా కాలనీ వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడిన నిఖిల్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రెండు రోజులుగా గాలింపు కొనసాగించారు.
ఘటనా స్థలానికి సుమారు 100 మీటర్లు దూరంలో ముళ్లపోదల్లో చిక్కుకుని ఉండడాన్ని గమనించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజీ కు తరలించారు. ఈ ఘటన తిరుపతిలో తీవ్ర విషాదాన్ని నింపింది.