కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామపంచాయతీ అల్లిపురంలో ఘటన
సిరా న్యూస్,ఖమ్మం;
ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల సింగరాయపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని అల్లిపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిర్ర సాయి(13)అనే బాబుకు ఉదయం జ్వరం రాగా స్థానిక ఆర్ఎంపి బెల్లంకొండ రామారావు ఇంజక్షన్ చేశాడు.మరలా సాయంత్రం 5:30 ఇంజక్షన్ చేశాడు ఈ ప్రాంతంలో మరోసారి బాలుడికి పరిశీలించి వైద్యుడు జ్వరం రాగా అర్జెంటుగా కెనాల్ పెట్టి ఇంజక్షన్ మూడు రోజులు చేయాలని సూచించాడు. అయితే బాలుడు తల్లి ఇంజక్షన్ టాబ్లెట్ ఇవ్వండి రేపు కొనిజర్ల లేదా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తామని చెప్పింది.. వెంటనే బాబు వాంతులు చేసుకుంటూ కళ్ళు మూసుకోవడంతో బాలుడు చనిపోయాడు.అర్హతలు లేనటువంటి ఆర్ఎంపీ డాక్టర్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కగాని ఒక కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్న అంటుకున్నాయి. గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.