BRS Bhukya Johnson Naik: కాంగ్రెస్‌కి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదు

సిరాన్యూస్‌,ఖానాపూర్ టౌన్
కాంగ్రెస్‌కి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదు
* బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్

ప్రజా పాలన ముసుగులో రేవంత్ నియంత పాలన చేస్తున్నార‌ని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆరోపించారు. శుక్ర‌వారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై నాయకులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు, దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేట అన్నారు.నిర్భందాలు, అరెస్టులు, ఆంక్షలు బిఆర్ఎస్ పార్టీకి కొత్తకాదని అన్నారు. అరెస్టులకు బెదిరేది లేదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *