సిరాన్యూస్ ,ఖానాపూర్ టౌన్
నవరాత్రుల పూజలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్య జాన్సన్
చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రజలు దేవినవరాత్రులు నిర్వహించి విజయదశమి జరుపుకుంటారని ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన దుర్గామత మండపం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారు ఈ దేవి నవరాత్రులలో వివిధ అలంకారాలతో భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవతగా కొలువుదీరుతారని ఆయన తెలిపారు. భక్తులు దేవి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే సమాజంలో చెడుపై మంచి విజయం సాధిస్తుందని తెలిపారు.కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ, పట్టణ, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.