సిరాన్యూస్, ఓదెల
బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఓదెల, మడక , కనాగర్తి గ్రామాల్లోని నేదురు రాజ కొమురయ్య, మాతంగి పోచమల్లు, గడ్డం రాజయ్యలు ఇటీవల మరణించారు. వారి కుటుంబాలను సోమవారం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ ఓదెల మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, నాయకులు నోముల ఇంద్రారెడ్డి, బండ నిఖిల్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గొర్ల కుమార్, ఓదెల గ్రామ శాఖ అధ్యక్షుడు పోలోజు రమేష్,తూడి సంపత్, బోయ సదయ్య,నేదురు రాజయ్య తూడిసదయ్య, ఆముదల అరుణ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.