సిరాన్యూస్, చర్ల
ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలి : బీఆర్ఎస్ నాయకుడు మానే రామకృష్ణ
ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలని బీఆర్ఎస్ నాయకుడు మానే రామకృష్ణ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నూతనంగా ఎన్నుకోబడిన కన్వీనర్, కో కన్వీనర్ దొడ్డి తాతారావు, ఐయినోల పవన్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ నాయకుడు మానే రామకృష్ణ హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడు లా పనిచేయాలని, ప్రతి గ్రామంలోనూ గ్రామ కమిటీలను వేయాలని సూచించారు. అనుబంధ సంఘాలను నియమించాలని, డిసెంబర్ 1న మండల స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి మహాసభ ను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త పార్టీ అభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు తమ పాత్రను పోషించాలని సూచించారు. సమావేశంలో రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఐక్య మత్యంగా పనిచేసి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భద్రాచలం కన్వీనర్ సునీల్ కుమార్, చర్ల మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.