సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నూనెటి కుమార్‌యాదవ్ అరెస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నిరసనను వ్యక్తం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులకు పాల్పడుతుంది. శుక్రవారం అందులో భాగంగానే బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు నూనెటి కుమార్‌యాదవ్ ను ముందస్తుగా ఉదయం 5గంటలకు కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈసందర్బంగా ఎన్నో పోరాటాలు, ధర్నాలు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు అనుభవించడం జరిగిందన్నారు. రానున్న రోజులో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకాల గర్భంలో మునిగిపోవడం ఖాయమన్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.