గోపాల్ పేట్ లో బీఆర్ఎస్ నిరసన

సిరా న్యూస్,గోపాల్ పేట్;
తెలంగాణ తల్లి విగ్రహస్థానంలో రాజీవ్ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా గోపాల్ పేటలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గోన్నారు.
సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టీ తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పట్టణములో జమ్మి చెట్టు చౌరస్తా నుండి భారీ సంఖ్యలో నాయకులతో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు గోపాల్ పేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహాన్నికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం ప్రభుత్వం భారత యూనియన్ నందు విలీనము తర్వాత స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రాన్ని నెహ్రూ గారి ప్రభుత్వం కుట్రతో ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాలను కలిపి సమైక్య రాష్ట్రం చేయడంతో ఆనాటి నుండి స్వరాష్ట్ర కాంక్ష కొరకు ప్రజలు ఉద్యమించి 1969 ప్రారంభమైన ఉద్యమం 1972వరకు పోరాటం చేసి 369 మంది అమరులైనారు.
30ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్న తరుణంలో కె.సి.ఆర్ నాయకత్వములో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఉద్యమం ప్రబంజనమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.10ఏండ్లుగా కె.సి.ఆర్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రన్నీ అగ్రభాగాన నిలిపారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారింటీలు,అమలు కాని 420హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 10నెలల కాలంలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వంసం చేశారు అని ఆరోపించారు. ఉచిత బస్సు తప్ప ఒక్క గ్యారంటీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టే పరిస్థితి దాపురించింది అని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, వాకిటి.శ్రీధర్,పి.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్, జాత్రు నాయక్,మాజీ z.p.t.c చంద్ర శేఖర్ నాయక్ కౌన్సిలర్స్ బండారు.కృష్ణ, నాగన్న యాదవ్,కంచే.రవి,కో. అప్షన్ సభ్యులు ఉస్మాన్ మండల నాయకులు రఘువర్ధన్ రెడ్డి, రవిప్రకాష్ రెడ్డి,ధర్మానాయక్,మహేశ్వర్ రెడ్డి,మాధవ్ రెడ్డి, దేవర్ల.నరసింహ,గోపాల్ పేట అధ్యక్షులు బి.బాలరాజు ,మాజీ ఎం.పి.పి సంద్య తిరుపతయ్య,చంద్ర శేఖర్ రాజేష్ గౌడ్,మతీన్,శ్రావణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *