BRS Somarapu Rajaiah: తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే : బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య

సిరా న్యూస్, సైదాపూర్:
తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధే : బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య
* తెలంగాణ తల్లి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయ‌కులు

కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ అస్థిత్వంతో పెట్టుకుంటే రాజకీయ సమాధేన‌ని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య ఆరోపించారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగ‌ళ‌వారం సైదాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయ‌కులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసివేస్తే తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరచినట్లే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య, పాక్స్ అధ్యక్షులు బిల్లా వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు, మాజీ సర్పంచ్ లు చందా శ్రీనివాస్, కాయిత రాములు, మాజీ ఎంపీటీసీ లు తొంట ఓదెలు, మండల ప్రధాన కార్యదర్శి చల్మెల్ల రాజేశ్వర్ రెడ్డి , సీనియర్ నాయకులు మోహనరావు. బి.లక్ష్మీ నారాయణ, టి.రజనీకాంత్, చాడ ఆదిరెడ్డి, పరకాల నారాయణ, పిల్లి కొమురయ్య, పున్నం కొమురయ్య, రమణచారి, వి. రమేష్, నరేష్ కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *