మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు తప్పదా….
సిరా న్యూస్,మహబూబ్ నగర్;
కృష్ణానదికి ప్రధాన ఉపనదిగా ఉన్న తుంగభద్ర నదిపై మరో నీటిపారుదల ప్రాజెక్టుకు పునాదులు పడబోతున్నాయి. అంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నారు. రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారుల మద్యన ప్రాధమిక చర్చ లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూ లు జిల్లా మంత్రాలయం నుంచి పంచముఖి వెళ్లే మార్గంపై రాకపోకలు సాగేందుకు వీలు గా కూడా ఈ ప్రాజెక్టును ఉపయోగించనున్నారు. బ్రిడ్జికం రిజర్వాయర్‌గా ఈ ప్రాజెక్టు ను నిర్మించేందుకు డిపిఆర్ సిద్దం చేయాలని నిర్ణయించారు. కృష్ణా నది బేసిన్ పరిధిలో మహారాష్ర , కర్ణాటక , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే కృష్ణానదీజలాలను ఉపయోగించుకోవాలంటే బేసిన్ ప రిధిలో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాల భాగస్వామ్యంతోనే నిర్ణయాలు జరగాల్సివుంది. ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక కృ ష్ణానదీ జలాలకు సబంధించిన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటివాటాలపై ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో వాదనలు నడుస్తున్నాయి. రెండు రాష్ట్రాల మద్య నీటి వినియోగంపై సమన్వయం నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీయాజమా న్య బోర్డును నియమించింది.కృష్ణా నది ప రివాహకంగా ఉన్న ప్రాంతంలో తుంగభద్ర నదిపై ఏ కొత్త ప్రాజెక్టు నిర్మించాలన్న తొలు త కృష్ణాబోర్డులో ప్రతిపాదించాల్సివుంది . తెలంగాణ , ఏపి ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం ద్వారానే ఏ ప్రాజెక్టుకైనా అనుమతి పొందాల్సివుంది.అంతేకాకుండా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స భ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్‌లో కూడా చ ర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సివుంది. అయితే ఇవేవి లేకుండానే తెలంగాణ రాష్ట్రం తో నామమాత్రంగానైనా చర్చించకుండా, క నీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆం ధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ముం దుకు పోతున్నాయి. బ్రిడ్జికం బ్యారేజి నిర్మాణంతో తుంగభద్ర నదిలో జలదోపిడికి సిద్దమవుతున్నాయి.కర్ణాటక రాఫ్ట్ర ప్రభుత్వ నీ టిపారుదల శాఖ మంత్రి బోసరాజు, రాయచూర్ ఎంపి కుమార్ నాయక్ ,కర్నూలు జి ల్లా ఎంపి పంచలింగాల నాగరాజుతోపాటు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధికారుల మధ్య మంత్రాలయంలో చర్చలు జరిగాయి. తుంగభధ్ర నదీజాలను రెండు రాష్ట్రాల్లోని కర్నూలు, రాయచూర్ జిల్లాల్లో ఉపయోగించుకునేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. నదిలో బ్రిడ్జికం రిజర్వాయర్ నిర్మించటం ద్వారా ఎన్ని టీఎంసీల నీ టిని నిలువ చేసుకునే అవకాశాలు ఉన్నా యి, రెండు రా్రష్ట్రాల్లో ఎన్ని లక్షల ఎకరాల కు సాగనీటిని అందించే వీలుంది తదితర వి వరాలపై సమగ్ర సర్వే నిర్వహించనున్నారుతుంగభద్ర నదిపై మంత్రాలయం వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మాణం వల్ల ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులపై పడనుంది. కృ ష్ణాపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజ్టెలకు కృష్ణానది తర్వాత దాదాపు తుంగభద్ర నదినుంచే అధికంగా నీటి లభ్యత ఉంటుంది. కృ ష్ణానది బేసిన్ పరిధిలో తెలంగాణ , ఆధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కే టాయించిన 811టిఎంసీల నీటి కేటాయింపుల్లో ఏటా 250టిఎంసీలనుంచి 350టిఎసీ ల వరకూ తుంగభధ్ర నదిద్వారానే నీటి ల భ్యత ఉంటోంది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పధకం, తుమ్మిళ్ల ఎత్తిపోతల ప థకం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ పథకం , నాగార్జున సాగర్ ఎడమ కాలువ తదితర వా టి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సివుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు కేటాయింపుల మేరకు నిక ర జలాలు కూడా అందటం లేదు. గత ఏడా ది సాగునీటి పారుదల మాట అటుంచి తా గునీటి అవసరాలకు సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కర్ణాటక ప్రభుత్వాన్ని బతిమాలుకోవాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు ఎగువన ఆంధ్రప్రదేశ్ , కర్నాటక రాష్ట్రా లు తుంగభద్ర పై మరో కొత్త ప్రాజెక్టు నిర్మా ణం చేపడితే ప్రభావం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైనే కాకుండా తాగునీటికోసం అన్ని వర్గాల ప్రజలపైన పడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *