సిరా న్యూస్, ఇంద్రవెల్లి:
బుద్ధ విగ్రహం ప్రతిష్టాపనను విజయవంతం చేయాలి
-సిందే చాయారాజు
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా, కిన్వట్ తాలుక, బోదడి గ్రామంలోని మహాప్రజా బుద్ధ విహార్లో జనవరి 8న నిర్వహించనున్న బుద్ధ భగవాన్ విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమాన్ని వియజవంతం చేయాలని, రమమాత మహిళ సంఘం మండల అధ్యక్షులు సిందే చాయారాజు అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కమిటీ సభ్యులతో కలిసి పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బోదడి గ్రామంలో నిర్వహించే బుద్ధ భగవాన్ ముర్తి స్థాపన కార్యక్రమానికి ఉపాసక్, ఉపాసికాలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వనమాల, కల్గుబాయి, మోహిని, అంబేడ్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కమిటీ మండలాధ్యక్షులు సోన్ కాంబ్లే మనోహర్, ప్రధానకార్యదర్శి కామ్రాజ్ వాగ్మారే, నాయకులు రాజ్వార్ధన్, దీలిప్ మోరే, బాపురావ్, నాగరాజ్, శివాజీ, లక్ష్మణ్, మారుతి, భారత్, దత్తా, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు.