సిరా న్యూస్,శింగనమాల;
ఆ పోలీసు తప్పతాగాడు. యూనిఫాం లోనే వున్నాడు. పోలీసు స్టేషన్ లోనే వున్నాడు. మరి పై అధికారులు లేరేమో కానీ పోలీసు స్టేషన్ కు వచ్చిన ఒక మహిళపై మద్యం మత్తులో రెచ్చిపోయాడు. కానిస్టేబుల్ షబ్బీర్, మహిళతో పోలీస్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తనే కాకుండా పచ్చి బూతులు తిడుతూ, బాధిత మహిళపై రాయితో దాడి చేసే ప్రయత్నం చేసాడు. తోటి కానిస్టేబులు తాగుబోతు షబ్బీర్ ను బలవంతంగా లోపలకు తీసుకుపోయాడు. కానిస్టేబుల్ షబీర్ నిర్వాకం అంతా విడీయోలో రికార్డయింది. మహిళల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.