సిరాన్యూస్, మంచిర్యాల
రోడ్డు ప్రమాదంలో వ్యాపారవేత్త రాజేశ్ కార్వా మృతి
ఢీవైడర్‌ను ఢీకొని వ్యాపారవేత్త మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ రంగానికి చెందిన వ్యాపారవేత్త రాజేశ్ కార్వా(42) గురువారం ఉదయం సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని జాతీయ రహదారి వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. మితిమీరిన వేగంతో కారు నడపడంతో ఢీవైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద సంఘటన తెలుసుకున్న కుటుంబ బంధువులు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన తీరుతున్న పరిశీలించి కన్నీళ్ల పర్యంతమయ్యారు. సంఘటన వార్త తెలుసుకున్న ఆటోమొబైల్ షాపులు తోపాటు మెకానిక్ షాపులు సైతం స్వచ్ఛందంగా మూసివేసి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.