సి కమ్యూనిటీహాల్ నిర్మాణమునకు స్థలం కేటాయించండి

-మున్సిపల్ చైర్మన్ కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ బీసీ సెల్ నాయకులు
సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపాలిటి పరిధిలో బిసి కమ్యూనిటీహాల్ నిర్మాణమునకు స్థలం కేటాయించాలని కోరుతూ మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోటికార్ కిషన్ జీ మాట్లాడుతూ మంథని శాసనసబభ నియోజకవర్గ కేంద్రంలో బీసి కమ్యూనిటి హాల్ నిర్మాణము చేయుటకు మంత్రి శ్రీధర్ బాబు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఐదు లక్షల నిధులు మంజూరు చేశారన్నారన్నారు. మంథనిలో 60 శాతానికి పైగా బీసిలు ఉన్నందున నియోజకవర్గ కేంద్రంలో బీసి కమ్యూనిటి హాల్ నిర్మించుట తప్పనిసరి అని అన్నారు, మంథని మున్సిపాలిటీ పరిధిలో గల గోదావరి నదికి వెల్లు మార్గంలో కరెంటు సబ్ స్టేషన్ ప్రక్కన మున్సిపాలిటి భూమి ఉందని అట్టి భూమిలో కొన్ని గుంటలు ఇచ్చినచో కమ్యూనిటి హాల్ నిర్మాణము చేసుకొనగలమన్నారు.ఇంతకు ముందు ఎన్నో పర్యాయాలు మీకు విజ్ఞప్తి చేసామని గుర్తు చేశారు. బీసిల సంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకొని కమ్యూనిటిహాలు నిర్మాణమునకు మున్సిపాలిటి భూమిని ఇప్పించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ నాయకులు పర్శవెన మోహన్ యాదవ్, మంతెన వేణుగోపాల్, కౌన్సిలర్ వికే రవి పాల్గొన్నారు.
——————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *