సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్ల మంజూరు: మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్
నియోజకవర్గం అభివృద్ధి లో భాగంగా ఎమ్మెల్యే విజయరామారావు ప్రత్యేక చొరవతో పొత్కపల్లి నుండి కాల్వశ్రీరాంపూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. ఈసందర్బంగా గురువారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే విజయరామారావు ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎం డి. మున్నీర్.సింగిల్ విండో చైర్మన్ చదువు రాంచెంద్రారెడ్డి, మండల అధ్యక్షులు గజవేనా సదయ్య యాదవ్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, మాజీ ఎంపీటీసీ రావి సదానందం, మాజీ సర్పంచ్ లు మదాసి సతీష్, అటికం శంకర్, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.