కార్తీకమాస ఏర్పాట్ల పరిశీలన

సిరా న్యూస్,శ్రీశైలం;

నవంబరు 2 నుంచి డిసెంబరు 1వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహించబడనున్నాయి.
భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్తీకమాసోత్సవాలకు వివిధ విస్తృత ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రోజు ఇంచార్జి కార్యనిర్వహణాధికారి చంద్రశేఖరరెడ్డి గణేశసదన్, అన్నప్రసాద వితరణ, భారత్ పెట్రోల్ బంకు మల్లికార్జునసదన్ ఎదురుగా గల పార్నింగు ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అన్నదాని విభాగాన్ని ఆదేశించారు. అన్నప్రసాద వితరణలో ఏ రోజు ఏం పెడుతున్నారో సూచికబోర్డులో ఉండాలని, నాణ్యమైన కూరగాయాలను తెప్పించుకోవాలన్నారు. ఆహారపదార్థాలను వృథా చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా అన్నప్రసాద వితరణలోని ఏమైన మరమ్మతులు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని, ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.అన్నప్రసాద వితరణ సమయములో సంబంధిత అధికారులు ప్రతి హాలులో కూడా అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేటట్లు పర్యవేక్షిస్తుండాలన్నారు. అన్నప్రసాదాలు వడ్డించే సిబ్బంది తప్పనిసరిగా వస్త్ర నిబంధన (డ్రస్కోడ్) పాటించాలన్నారు.. అదేవిధంగా సిబ్బంది అందరు కూడా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు. అన్నదాన మందిరములో శుచీ శుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ద కనబర్చాలన్నారు. ఎప్పటికప్పుడు అన్నదాన మందిరాన్ని శుభ్రపరుస్తుండాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆ తరువాత గణేశసదన్ పరిశీలిస్తూ భక్తులకు గదులు కేటాయించేటప్పుడు వారి ఆధార్ కార్డు తప్పనిసరిగా పరిశీలించాలని ముఖ్యంగా భక్తులందరితో మర్యాదపూర్వకంగా మెలగాలని సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఆలస్యం లేకుండా గదులు, ఖాళీ అయిన వాటిని శుభ్రం ఎంతైనా అవసరమన్నారు.ఏ ఒక్క భక్తుడి నుండి కూడా ఫిర్యాదు లేకుండా సమర్ధవంతంగా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు.అలాగే భక్తుల సౌకర్యార్థం గణేశ్ సదన్ వద్ద మిని కల్యాణకట్టను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే భారత్ పెట్రోల్ బంకు వద్ద ఏ.టి.ఎంల ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు. (ఐ)/సి) పి.వి. సుబ్బారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *