సిరా న్యూస్, ఓదెల
గాంధీజికి నివాళులర్పించిన సీఏ రజిత
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బోట్ల వనపర్తి గ్రామంలో మహిళా సంఘం సీఏ రజిత ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం సీఏ దోనూరి రజిత మాట్లాడుతూ అహింస మార్గంతో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మహాత్ముడు గాంధీజీ అన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.