సిరాన్యూస్, జైనథ్
కాప్రిలో ఘనంగా కుంకుమార్చన
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాప్రి గ్రామంలో దేవి శరన్నవరాత్రుల ను పురస్కరించుకొని వైభవంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. దుర్గా నవశక్తి మహిళా మండల ఆద్వర్యంలో స్థానిక శ్రీ శభరి మాత ఆలయంలో వేద పండితుల ఆద్వర్యంలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ కుంకుమార్చన కార్యక్రమంలో గ్రామంలోని మాహిళలందరు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈసందర్బంగా అర్చకులు వసంతా చారి మాట్లాడుతూ మహా ఫల ప్రదమైన దేవి జన్మ నక్షత్రం అయిన మూల నక్షత్రము నాడు కుంకుమ చేరడం వల్ల భక్తులకు విశేషమైన సంపదలు ఆయురారోగ్యాలు, సంతాన, ఫలితాలు కలుగుతాయని అన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ రమీళ వెంకట్ రెడ్డి పాల్గొని శారద మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.