సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
కంటి చూపు విషయంలో జాగ్రత్తలు పాటించాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* ప్రపంచ కంటి చూపు దినోత్సవ కార్యక్రమం
కంటి చూపు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా వరకు బోస్లె గోపాలరావు పాటిల్ ఐకేర్ సెంటర్ ముధోల్, ఎల్ వి ప్రసాద్ ఐకేర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మాట్లాడుతూ ఎల్ వి ప్రసాద్ ఐకేర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రజలకు కంటి చూపు పైన అవగాహన కల్పించామని చెప్పారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇవ్వకుండా క్రీడలు నేర్పాలని తెలిపారు. మొబైల్ ఫోన్ చూడడం వల్ల కంటి చూపు మందగించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఖానాపూర్ పట్టణంలోని ప్రతి వార్డులో ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు ఎల్ వి,ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సభ్యులు నిర్వహిస్తారని తెలిపారు. పట్టణంలో కంటి చూపు సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజల కోసం ఉచిత ఐ కేర్ సెంటర్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు . కార్యక్రమంలో కౌన్సిలర్స్ , నాయకులు, జన్నరపు శంకర్, నాయిని సంతోష్ ,అమనూల్ల ఖాన్ ,కిషోర్ నాయక్ , కుర్మా శ్రీనివాస్ ,షబ్బీర్ పాషా , కోఆర్డినేటరాస్స్ సాయాన్న, ఓం ప్రకాష్, సుపర్డెంట్ వంశి మాధవ్, మరియు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ సభ్యులు ప్రభుత్వ ప్రవేటు వైద్య సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.