సిరాన్యూస్ ,కళ్యాణదుర్గం
సమిష్టి కృష్టితో బాల్య వివాహాలు నివారిద్దాం : ఎమ్మెల్యే సురేంద్రబాబు
బాల్య వివాహలు నివారిద్దాం… బాలికల భవిష్యత్తుకు బాటలు వేద్దామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నివారణ, కమిటీలపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హాజరయ్యారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ బాల్య వివాహల నివారణ కోసం మా కార్యకర్తలకు కూడా అవగాహన కల్పిస్తామని, బాల్య వివాహలు నివారించాలంటే ఇక్కడ మరింత మెరుగైన విద్యా అవకాశాలు, వారికి తగిన హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తే చాలా వరకు బాల్య వివాహాలు నివారించవచ్చని తెలిపారు. బాలికలకు మెరుగైన వసతులు కల్పించి వారికి తగిన విద్యా అవకాశాలు కల్పించి, బాలికల భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు.. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాలికల విద్య కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో నా వంతుగా మెరుగైన విద్య, హాస్టల్ సౌకర్యాలు కల్పన, చదువుకున్న యువతుల కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు.అనంతరం నియోజకవర్గంలో ఎక్కడా కూడా బాల్య వివాహాలు నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ అధికారులతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు.