సిరా న్యూస్,హైద్రాబాద్;
హైద్రాబాద్ మింట్ కాంపౌండ్ లో రోడ్డుపై వెళ్తున్న ఓ కార్ లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారు ఆపి బయటికి వచ్చేసాడు. ఘటనలో కారు పూర్తిగా దగ్ధం అయింది. సంఘటన స్థలానికిచేరుకున్న జీహెచ్ ఎంసి వాటర్ ట్యాంకర్, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.