సిరా న్యూస్,గుంటూరు;
గుంటూరు అరండల్ పేట ఠాణాలో రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన ఘటనలో సీసీటీవీ ఫుటేజీ లీకేజీకి సంబంధించి టెక్నీషియన్తో పాటు ఓ దినపత్రిక విలేకరిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
రిమాండ్ ఖైదీ అనిల్ కుమార్ అరండల్ పేట పోలీస్ స్టేషన్లో బల్లపై దిండు, దుప్పటి సమకూర్చి పడుకోబెట్టడం, రౌడీషీటర్ కుర్చీలో కూర్చొని.. పోలీసులతో గట్టిగా మాట్లాడిన సీసీ కెమెరా ఫుటేజీని అరండల్పేటకు చెందిన టెక్నీషియన్ శేషగిరిరావు అలియాస్ శేషు ఓ దినపత్రిక విలేకరి అరుణ్ కుమార్ కు ఇచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్ లు కేసు నమోదుచేయాలని పోలీసుల్ని ఆదేశించారు. దీంతో ఎస్సై కృష్ణబాజి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.