ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

 సిరా న్యూస్,న్యూఢిల్లీ;
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2024- 25 విద్యా సంవత్సరానికి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ మేరకు సీబీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తరగతులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే ఏడాది) జనవరిలో ప్రారంభం కానున్నాయి. ఇక CBSE 10వ తరగతి, 12వ తరగతికి సంబంధించిన థియరీ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి.పదో తరగతి, 11వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు 2025, జనవరి 1 నుంచి, థియరీ పరీక్షలు 2025, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారిక ప్రకటనలో వెలువరించింది. ప్రాక్టికల్/ప్రాజెక్ట్/ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు సంబంధించి మార్కులను అప్‌లోడ్ చేసేటప్పుడు పాఠశాలలు కొన్నిసార్లు తప్పులు చేస్తున్నాయని, ఈ సారి ఈ విధమైన తప్పులు చోటు చేసుకోకుండా.. ఆయా పాఠశాలలకు ప్రాక్టికల్/ప్రాజెక్ట్/అంతర్గత మూల్యాంకనం, థియరీ పరీక్షలను సజావుగా నిర్వహించడంలో సహాయపడటానికి సబ్జెక్టుల జాబితా సమాచారం వివరాలను కూడా సర్క్యులర్‌కు జతచేసినట్లు బోర్డు వెల్లడించింది.
సీబీఎస్సీ బోర్డు పరీక్షల మార్కుల నమోదు జాబితా..
తరగతి
సబ్జెక్ట్ కోడ్
విషయం పేరు
థియరీ పరీక్షలో గరిష్ట మార్కులు
ప్రాక్టికల్ పరీక్షలో గరిష్ట మార్కులు
గరిష్ట మార్కుల ప్రాజెక్ట్ అంచనా
గరిష్ట మార్కుల అంతర్గత మూల్యాంకనం (|A)
ప్రాక్టికల్/ప్రాజెక్ట్ అసెస్‌మెంట్ కోసం ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్‌ని నియమిస్తారా?
బోర్డు ద్వారా ఆచరణాత్మక సమాధానపుస్తకం అందించబడుతుందా
థియరీ పరీక్షలలో ఉపయోగించే జవాబు పుస్తకం రకం
ఈ జాబితాలో ఇచ్చిన వివరాల ప్రకారం థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్, IA భాగాల మధ్య మార్కుల పంపిణీతో ప్రతి సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులు కేటాయిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. CBSE వింటర్-బౌండ్ పాఠశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు నవంబర్ 5 నుంచి డిసెంబర్ 5 మధ్య జరుగుతాయి. ఈ పాఠశాలల్లో కూడా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, ప్రాజెక్ట్, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లను నిర్వహించడానికి బోర్డు SOPలు, మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *