సిరా న్యూస్,తిరుమల;
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా, మాజీ ఎంపీ కేసినేని నాని, విశాఖపట్నం టిడిపి ఎమ్మెల్యే గణబాబు, తదితరులు శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో, వీరికి పండితులు వేద ఆశీర్వచనం పలకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.