సిరా న్యూస్, సైదాపూర్:
సహకార సంఘం అభివృద్దే ధ్యేయం : ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి
వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘాల అభివృద్దే తమ ధ్యేయం అని ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అర్ధ వార్షిక నివేదిక బడ్జెట్, అప్పులు, ఖర్చులను సీఈఓ చెన్నవేణి శ్రీధర్ చదివి వినిపించారు. ఈసందర్బంగా ఛైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సంఘంలో తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందరి సహకారంతో వెన్కేపల్లి-సైదాపూర్ విశాల పరపతి సంఘ వరిధాన్యం కొనుగోలు ద్వారా 4.79కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. రైతులు సాంకేతికపరంగా మార్పులు చెందాలని, ఇప్పుడు పంటలకు డ్రోన్ సిస్టం ద్వారా పిచికారి చేసినట్లయితే అధిక లాభాలను పొందవచ్చని తెలిపారు. డ్రోన్ల్న ఆసక్తి ఉన్న రైతులకు సంఘం ద్వారా రుణాలు ఇప్పించి రైతులను వ్యవసాయ యాంత్రికం లో భాగస్వామ్యం కావాలన్నారు. త్వరలో నూతన భవనం మరియు ఫంక్షన్ హాల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు కలకోటి కిషన్ రావు, డైరెక్టర్లు మునిపాల రవి, బొమ్మగాని రాజు, నమిండ్ల జమున, గుండేటి జయకృష్ణ, పల్నేని ప్రవీణ్ రావు, ఏలూరి తిరుపతి రెడ్డి, ఏలూరి నర్సిరెడ్డి, చాడ ప్రకాశ్ రెడ్డి, ఓలాద్రి మహిపాల్ రెడ్డి, గుగులోతు లక్ష్మీ, అఫీస్ సిబ్బంది చెన్నవేణి శ్రీధర్, ఈరాల భిక్షపతి, ఎలబోయిన మహేష్, కామారపు శ్రీకాంత్, అనగోని అఖిల్, బావండ్ల కేశవులు రైతులు, ప్రజలు పాల్గొన్నారు.