సిరాన్యూస్, జైనథ్
జైనథ్ లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద
ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరళ్ళ శారద గురువారం జైనథ్ మండలంలోని న పురాతన పుణ్య క్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఆమెకు ఘనం గా స్వాగతం పలికారు. ఆమె ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం విశిష్టతను, చరిత్రను అర్చకులను అడిగి ఆమె తెలుసుకున్నారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ,కుమ్ర ఈశ్వరి బాయి,కంది మౌన శ్రీనివాస్ రెడ్డి జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి,గడ్డం జగదీశ్ పిడుగు స్వామి ఎల్మ రాం రెడ్డి,లోక ప్రవీణ్ రెడ్డి కార్యకర్తలు ఉన్నారు.