సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 1వ వార్డు గాంధీనగర్ కాలనీలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్నిగురువారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెంబి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకుని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అనంతరం కాలనీలో సీజనల్ వ్యాధులకు ప్రజలకు అవగాహన కల్పించారు . ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు నాయిని సంతోష్ , అమానుల్లా ఖాన్ , కుర్మా శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ , వైద్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది ,ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.