సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
మున్సిపల్ పారిశుధ్య సిబ్బందిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మున్సిపాలిటీ ఉద్యానవనం పార్కులో సోమవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుధ్య సిబ్బందిపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం మంగళవారం బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్కు చూడడానికి వచ్చిన వ్యక్తులు తేనెతెట్టును రాళ్లతో కొట్టడంతో తేనెటీగలు ఒక్కసారిగా మున్సిపాలిటీ సిబ్బందిపై దాడి చేశాయని తెలిపారు. ఆయన వెంట వైస్ చైర్మన్ కావలి సంతోష్ , కౌన్సిలర్స్ నాయకులు జన్నారపు శంకర్ ,నాయిని సంతోష్ , అమానుల్లా ఖాన్ , కిషోర్ నాయక్ , షబ్బీర్ పాషా , మున్సిపల్ కమిషనర్ మనోహర్ , తదితరులు పాల్గొన్నారు.