మారని పెద్దా రెడ్డి తీరు

సిరా న్యూస్,తిరుపతి;
ఏ రాయి అయితేనేం పల్లు ఉడగొట్టుకోవడానికి అన్నట్లు తయారైందంట పుంగనూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లతో పాటు ప్రజల పరిస్థితి .. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో దందాలు నడిస్తే తాజాగా ఊరికొకరు సామంత రాజుల్లా తయారై తమ మీద ప్రతాపం చూపుతున్నారని అక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ దందాలతో పాటు క్యారీల వద్ద మాముళ్లు, స్థలాలపై పెత్తనం మరో వైపు బ్రాందీ షాపులు, చివరకు బెల్ట్ షాపులకు సైతం లక్షలాది రూపాయలు వసూల్లకు పాల్పడుతున్నారన్న అరోపణలు వస్తున్నాయి. దీంతో టీడీపీ కేడర్ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక.. దీని కోసమా తాము పోరాటాలు చేసిందని తలలు పట్టుకుంటుందట.పుంగనూరు నియోజకవర్గం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట వ్యాప్తంగా ఆ పేరు చెప్తే వినిపించే పేరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అప్పట్లో పెద్దిరెడ్డి తన స్థాయిలో తాను వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు ఉంటే.. ఆయన పేరు చెప్పుకుంటూ చోటా మోటా నేతలు అనేక దందాలు నడిపారు. అక్రమంగా పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు. టీడీపీ నేతలు నోరు విప్పితే జైళ్లలో పెట్టించారు.. నెలల తరబడి టీడీపీ శ్రేణులు జైళ్లలో మగ్గిన ఉదంతాలు కూడా ఉన్నాయిమరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటన సందర్భంగా ఆయన్ని సైతం అడ్డుకుని దాడికి ప్రయత్నించారు. ఆ సందర్భంగా పోలీసులతో జరిగిన గొడవ కేసులో అయితే చిన్నా పెద్దా తేడా లేకుండా వందల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అనేక కేసులలో జైలుకు వెళ్ళారు. ఆ కసితో ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నికల్లో పనిచేసారు. అయితే ఇక్కడ టీడీపీ ఓటమి పాలయినప్పటికి తనకు తిరుగులేదని భావిస్తున్న పెద్దిరెడ్డికి ఓటమి భయం చూపించారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వెదజల్లిన పెద్దిరెడ్డి తన కంచు కోటగా భావిస్తున్న పుంగనూరులో చచ్చిచెడీ 6 వేల 600 ఓట్లతో గట్టెక్కగలిగారు.రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయంపాలై కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పుంగనూరులో మాత్రం పరిస్థితులు మారడం లేదంట. పెద్దరెడ్డి అనుచరులు, వైసీపీ నేతల దందాలు యథావిధిగా కొనసాగుతుండటంతో తెలుగు తమ్ముళ్లు ,టిడిపి సానుభూతి పరులు దీని కోసమా మేము పోరాటం చేసామని వాపోతున్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుంది. చౌడేపల్లి మండలంలోని లద్దిగం చేరువు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రతిరోజు వందలాది టిప్పర్లను బెంగుళూరుకు తరలిస్తున్నారు. మండలానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు ఈ వ్యవహారం నడిపిస్తున్నారని అంటున్నారు.నెల్లూరు చెందిన ఓ వైసిపి నాయకుడికి బెంగళూరులో ఇసుక వ్యాపారాలు ఉన్నాయంట. ఆయన దగ్గర నెలకు 20 లక్షల రూపాయలు తీసుకుని చౌడేపల్లి మండల నేత ఇసుక సప్లై చేస్తున్నారంట. మరో వైపు నియోజకవర్గంలో మద్యం షాపుల టెండర్లలో కూడా గొడవ జరిగింది. తమ అనుమతి లేనిదే దుకాణాలు పెట్టకూడదని వైసీపీ నేతలు ఆంక్షలు విధిస్తున్నారంట . నియోజకవర్గంలో అత్యంత ఎక్కువుగా మద్యం అమ్ముడయ్యే బోయకొండ ఆలయం సమీపంలో మద్యం దుకాణం పెట్టుకోవడానికి ప్రయత్నించిన మద్యం షాపు యజమానిని బెదిరించారని తెలుస్తోంది. ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అంటున్నారు. బ్యాన్ చేసిన బెల్ట్ షాపులకు సైతం డిపాజిట్ల పేరుతో చోటా నాయకులు పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు.వైసీపీ నాయకుల దందాలకు టీడీపీ నేతలు ఒకరిద్దరు అండగా ఉన్నారంటున్నారు. వివాదంలో ఉన్న భూముల విషయంలో టిడిపి నాయకుల పేరు అడ్డుపెట్టుకుని వైసీపీ వర్గాలు బాధితులను బెదిరిస్తున్నాయంట. ముఖ్యంగా పుంగనూరు లో వైసిపి కీలక నేతకు సంబంధించి ఓ భూ వివాదం నడుస్తోంది. దానికి సంబంధించి బాధితుడిని బెదిరించడమే కాకుండా కేసులు పెట్టించారని , సివిల్ కేసులలో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను బెదిరిస్తున్నాంట. ఇటీవల ప్రదీప్ అనే యువకుడిని పుంగనూరు టీడీపీ నాయకుడు ఒకరు పదేపదే బెదిరిస్తుండటంతో అతను టీడీపీ రాష్ట కార్యాలయానికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందంటే పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అనుచరుల పెత్తనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందంటున్నారు.రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నట్లుందని పుంగనూరు టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. కాసుల కోసం ఒకరిద్దరు పార్టీ నేతలు పెద్దిరెడ్డి వర్గానికి సహకరిస్తున్నారని.. దాంతో వైసీపీ నేతల పెత్తనం యథావిధిగా సాగిపోతుందంటున్నారు.. తమను ఇన్చార్జీ గాని పార్టీ నాయకులు కాని పట్టించుకోవడం లేదని తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా నియోజకవర్గంలో ఎవరూ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మరి పుంగనూరు నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దడానికి టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *