chigurumamidi: చిగురుమామిడిలో ఆరోగ్య మహిళా కార్యక్రమం

సిరాన్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడిలో ఆరోగ్య మహిళా కార్యక్రమం

గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేసే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్నికరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈసంద‌ర్బంగా రామంచ బొమ్మనపల్లి గ్రామాలకు చెందిన మహిళలు వైద్య పరీక్షలకు హాజరయ్యారు. బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. బొమ్మనపల్లికి చెందిన 32 మంది మహిళలకు బిపి షుగర్ థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి ఏఎన్ఎం ధనలక్ష్మి, రామంచ ఏఎన్ఎం స్వాతి, ఆశా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *