సిరాన్యూస్,చిగురుమామిడి
చిగురుమామిడిలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
చిగురుమామిడి మండలంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.మండలంలోని అన్ని గ్రామా పంచాయతీ కార్యాలయంలో సంబంధిత అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు. మండల తహసీల్దారు కార్యాలయంలో తహసీల్దారు రమేష్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడివో ఖజా మొహియుద్దీన్, ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ జంగా వెంకటరమణ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం మట్టెల సంపత్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటిసి గీకురు రవీందర్, సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు ఐ రెడ్డి సత్యనారాయణ రెడ్డి, దాసరి ప్రవీణ్ కుమార్ నేత, చిట్టుమల్ల రవీందర్, పోలు స్వప్న, ముద్రకోల రాజయ్య, లచ్చిరెడ్డి, సంజీవ్, రమేష్, ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.