సిరాన్యూస్, కళ్యాణదుర్గం
చిన్నంపల్లిలో చిరుత దాడిలో దూడ మృతి
చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన చిన్నంపల్లి గ్రామంలో జరిగింది. శెట్టూరు మండల పరిధిలోని చిన్నంపల్లి గ్రామంలో రైతు వెంకటేశులు రోజువారీగానే గేదె దూడను పొలం వద్ద కట్టేయగా రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. అటవీశాఖ అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేసి, గ్రామంలోకి చిరుత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి గ్రామస్థులు కోరుతున్నారు.