సిరాన్యూస్, ఆదిలాబాద్
మిస్టర్ టి రెస్టారెంట్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్ : సీఐ ఫణిందర్
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 3 వ తేదీ రాత్రి సమయంలో మిస్టర్ టి రెస్టారెంట్లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ఫణిందర్ తెలిపారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇందులో దొంగతనం చేసిన వ్యక్తి కుంబోజు రాజేష్ ను, అతనికి సహకరించిన బాలుడుని అదుపులోకి తీసుకొని వారిద్దరి నుంచి రూ.5 వేల నగదు, రెండు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో రెండో వ్యక్తి అయినా బాలుడు అదే రెస్టారెంట్లో వర్కర్ గా పని చేస్తున్నాడు. అతని సహకారంతో కుంబోజు రాజేష్ మిస్టర్ టీ రెస్టారెంట్లో పదిహేను వేల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది. దొంగతనం చేసిన డబ్బులను వారి జలసాలకు ఖర్చు పెట్టుకోగా మిగిలినటువంటి 5050 రూపాయలు ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ఈ కేసులో కుంబోజు రాజేష్ ను రిమాండ్ కు పంపించినట్లు పేర్కొన్నారు. మైనర్ బాలుడిని జువెనైల్ హోం కు పంపించినట్టు చెప్పారు.
వ్యాపారస్తులకు, దుకాణదారులకు పోలీసు వారి సూచన…
వ్యాపారస్తులు ఎవరూ కూడా తమ దుకాణాలలో కౌంటర్లో డబ్బులు ఉంచి రాత్రిపూట తాళం వేసుకొని వెళ్లొద్దు. ఈ పరిస్థితుల్లో కౌంటర్లో ఉన్న డబ్బులు అన్ని తీసుకొని వెళ్లాల్సిందిగా కోరారు. గత నెలలో సాగర్ సూపర్ మార్కెట్లో జరిగినటువంటి దొంగతనంలో కూడా ఈ షాప్ లో పనిచేసే వర్కర్ దొంగతనం చేయడం జరిగిందని తెలిపారు.ఈ కేసును ఛేదించి అతని రిమాండ్ చేయడం జరిగింది. మిస్టర్ టీ రెస్టారెంట్ కేసులో కూడా షాప్ లో పని చేసే వర్కర్ దొంగతనానికి పథకం రచించి అతని స్నేహితునితో కలిసి దొంగతనం చేయడం జరిగింది. దుకాణదారులు షాప్ లో పనిచేసే వర్కర్లపై వారి కదలికలపై నిఘా ఉంచాలని కోరారు.