సిరా న్యూస్,సామర్లకోట
సామర్లకోట సీఐగా కృష్ణ భగవాన్
పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కృష్ణ భగవాన్ ను నియమిస్తూ పోలీసు ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు ఆదివారం సీఐగా కృష్ణ భగవాన్ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్బంగా సీఐ మాట్లాడుతూ సామర్లకోట ప్రజలకు అందుబాటులో ఉంటా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని తెలిపారు. అంతకు ముందు సీఐకి పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కృష్ణ భగవాన్ పెద్దాపురం ఎస్సైగా పని చేశారు.