సిరా న్యూస్,కొలిమిగుండ్ల;
గనుల మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ శాఖల మార్గదర్శకాలకు అనుగుణంగా శనివారం కొలిమిగుండ్లలోని రాంకో సిమెంట్స్ లో ‘ స్వచ్ఛతా హి సేవా – 2024’ కార్యక్రమానికి శ్రీ కారంచుట్టారు. ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద మానవహారం నిర్వహించి స్వచ్ఛత పై ప్రతీజ్ఞ చేశారు. అక్టోబర్ 2 వరకు పరిసరాల పరిశుభ్రత పై వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాల శుభ్రత, మొక్కల పెంపకం, పరిశుభ్రత పై బడి పిల్లలకు అవగాహన కార్యక్రమాలు, పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. పరిశుభ్రత నాగరికతకు చిహ్నం అని, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టుపక్కల పరిసరాలు బాగుండాలని యూనిట్ హెడ్ రెడ్డి నాగరాజు అన్నారు. శానిటేషన్ పై ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన అన్నారు. జాతిపిత గాంధీ ఆశయాలకు అనుగుణంగా దేశం అభివృద్ధి సాధించాలంటే పరిసరాలు బాగుండాలని అడ్మిన్ హెడ్ రామరాజు చెప్పారు.
ఈ సంవత్సరం స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే నేపథ్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతాయని మైన్స్ జీఎం అజ్మల్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రంలో వీపీ వెంకట్రామన్, AVP సూర్యకాంత్, సీనియర్ జీఎం రవికుమార్, ఫ్యాక్టరీలో ని ఆయా విభాగాల అధిపతులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు