హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిరా న్యూస్,సిద్దిపేట;
సిద్దిపేట పోలీస్ కన్వీన్షన్ హల్ లో ట్రెస్మా ఆధ్వర్యంలో గురు పూజత్సవ వేడుక కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హజరయ్యారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కు ప్రత్యేకత ఉంది మీ ప్రయత్నం కృషి వల్లే పదవ తరగతి ఫలితాల్లో సిద్దిపేట అగ్రగామిగా ఉంది.ప్రభుత్వ. ప్రయివేటు పాఠశాలల చిత్తశుద్ధి మంచి ఫలితాలు వచ్చాయి. కొద్ది తేడాతో రెండవ స్థానంలో ఉన్నాము. సీఎం రేవంత్ ప్రసంగం చూసిన. ప్రభుత్వ ప్రయివేటు ఉపాధ్యాయుల మధ్య తేడా చూపుతూ చెప్పడం దురదృష్టకరం. ఉపాధ్యాయుల విషయం లో తేడా తగదు. ఇలా కించపరుస్తూ మాట్లాడటం సీఎం కు వివక్ష ఉండొద్దు అని సూచిస్తున్న జీతాలు తక్కువ ఉండచ్చు సామర్ధ్యం విషయంలో ప్రయివేటు టీచర్లు బాగా ఉన్నారు. ప్రయివేట్ టీచర్లు సాలరీ లో మాత్రమే తేడా,కానీ సామర్థ్యం లో కాదు. ఒకరిని మెచ్చుకునే క్రమంలో ఒకరిని కించపరిచే వ్యాఖ్యలు సీఎం స్థాయి మనిషికి తగదు, ప్రభుత్వ పాఠశాల లను మెరుగు పరుచు కానీ ప్రయివేట్ పాఠశాల లపై చిన్న చూపు తగదు. ప్రయివేటు ఉపాధ్యాయుల గౌరవ ఏర్పాటు సంతోషం గురువుల మధ్య భేదం వద్దు. ప్రభుత్వ ప్రయివేటు ఉపాధ్యాయులు ఇద్దరి వృత్తి ఒక్కటే. ప్రభుత్వ. ప్రయివేట్ గురువు లెక్క శిష్యులు చూడరు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికంటే ప్రయివేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికం
ప్రయివేటు పాఠశాల మీద నమ్మకం ఉండే. ఇంగ్లీషు కూడా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉంది పిల్లలను బాగా చదివించడమే ఒక ఆస్తి భావన తల్లిదండ్రులలో వచ్చింది. విద్య విషయం లో తల్లిదండ్రులు రాజీ పడడం లేదు. ప్రయివేటు విద్య వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పాత్ర లో ఉంది. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ప్రయివేటు విద్య సంస్థలు చేస్తున్నాయి.. తెలంగాణ పిల్లలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. తెలంగాణ నెంబర్ వన్ గా ఉండడం వల్ల కేంద్రం నిధులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది.
16వ ఆర్థిక సంఘము సమావేశంలో కూడా చెప్పిన. వెనుకబడిన ప్రాంతాల్లో నిధుల కేటాయింపు ఎక్కువగా ఉంటే. తెలంగాణ పరిస్థితి ఎలా అని ప్రశ్నించా. దక్షిణ భారతదేశం అంటే చిన్నచూపు. బాగా పనిచేయడం కూడా మనకు ఇబ్బంది గా ఉంది
బాగా పనిచేసే వారిని ప్రోత్సహించడం ముఖ్యం. సీఎం రేవంత్ కూడా ఆలోచన చేయాలి. ప్రయివేటు పాఠశాలల పట్ల చిన్నచూపు తగదు. ప్రభుత్వ. ప్రయివేటు స్కూల్స్ రెండు కండ్లు.. ఎస్సి. ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూసింది 10 నెలలు అయిన నిధులు రాలేదు. బెస్ట్ ఆవేలబుల్ స్కూల్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల బీమా స్వంతంగా చేసిన ఈ జిల్లా గౌరవము పెంచారు. ఈ ఏడు కూడా 5 లక్షల ఉచిత భిమా పథకం అందిస్తా
విద్యార్థులలో నాలెడ్జ్ ఉంది కానీ మాట్లాడే తత్వం పెరగాలి. కుటుంబ సంస్కృతి పెరగాలి కుటుంబ బంధాలు బలపడే విధంగా టీచర్లు కూడా బోధన చేయాలి. తల్లిదండ్రుల విలువ పిల్లలకు తెలిసే విధంగా చూడాలి. కుటుంబ బాంధవ్యాలు పెరిగే విధంగా చూస్తే ప్రయోజనం మన కుటుంబం. మన ఊరు. మన రాష్ట్రం మన దేశం గూర్చి ఆలోచన వచ్చేలా పిల్లల్లో మార్పు తేవాలి.